Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాశివరాత్రి జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన వెదిరె బ్రదర్స్

మహాశివరాత్రి జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన వెదిరె బ్రదర్స్

- Advertisement -

పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు..
క్రీడాకారులు గొప్ప అవకాశంను సద్వినియోగం చేసుకోవాలి..
వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి.. 
నవతెలంగాణ – మునుగోడు

మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా వారం రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర బ్రహ్మోత్సవాల అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ తో కలిసి వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి, వైస్ చైర్మన్ , గ్రామ  ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి కొంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి శివాలయం వెళ్ళే దారిలో సుమారుగా 1 కిలోమీటర్ వరకు రోడ్డుకు ఇరువైపుల మొరం (మట్టి) పోసి దాదాపుగా 40 ఫీట్ల రోడ్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మేఘా రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహాశివరాత్రికి కొంపల్లి గ్రామంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు  మునుగోడు మండలం తో పాటు చండూరు ,గట్టుపల్ , నారాయణపురం చౌటుప్పల్ , చిట్యాల మండలాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని తమ లక్ష్యమని అన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీలలో నియోజవర్గంలోని యువకులు, క్రీడాకారులు పోటీలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను కనబడుచుకునేందుకు గొప్ప అవకాశం అని అన్నారు. పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరావాలని కోరారు. గ్రామంలోని ప్రజలు, యువకులు , ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అభివృద్ధి పనులలో పాల్గొనాలని కోరారు . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జీడిమడ్ల ఇందిరమ్మ మల్లయ్య, జాల నరసింహ , బోయపర్తి ప్రసాద్, జీడిమడ్ల నరేష్ , జీడిమడ్ల మౌనిక సురేష్, సుర శ్రీశైలం , సంకు శంకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -