రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తాయని రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరు మున్సిపల్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
అలాగే రైతుబంధు రైతు బీమా వంటి రైతు సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా కాంగ్రెస్ ముందుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రేపు జరగబోయే ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఐదో వార్డ్ అభ్యర్థి చింతకింది మురళి తో పాటు పలు వార్డు నెంబర్లు, పారునంది భాస్కర్, ఉపసర్పంచ్ దశరథ, వార్డ్ మెంబర్ మస్తాన్, జియాతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



