నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన వృద్ధ మహిళ మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్ఐ లింబాద్రి తెలిపారు. వనపర్తి జిల్లా నివాసి మిరిగిల్లా సరోజమ్మ (75) భవానీనగర్ నుంచి స్నేహపురి కాలనీ వైపు వెళ్తూ రైలు బండి రాకను గమనించకుండా రైల్వే పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో వచ్చిన తిరుపతి స్పెషల్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరోజమ్మ రైల్వే పట్టాల పక్కకు పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం రాగానే తాము సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారనీ ఆయన తెలిపారు.
రైలు ప్రమాదంలో వృద్దురాలు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



