- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో తెలంగాణ పబ్లిక్ , ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఆటో రవాణా రంగ కార్మికులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును తాసిల్దార్‌కు అందజేశారు. ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు అనుకూలంగా మోటార్ వాహన చట్టం–2019ను సవరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి చింతల నాగరాజు, ఆటో యూనియన్ నాయకులు జగన్, భాస్కర్, గణేష్, శేఖర్, బాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



