Monday, February 9, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం)ను గెలిపించండి

ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం)ను గెలిపించండి

- Advertisement -

4వ వార్డు మొరిగాడి భాగ్యలక్ష్మి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం
సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ – ఆలేరు రూరల్

అనేక సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తుందని, ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4వ వార్డులో మొరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతారని పేర్కొన్నారు. గత పాలకులు పారిశుద్ధ్య సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను, స్మశాన వాటికల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా నిలిచే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారిని గెలిపించాలని, ఎన్నికల్లో డబ్బుకు లొంగకుండా రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మికి సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మొరిగాడి రమేష్ జూకంటి పౌల్, సుధాగాని సత్య రాజయ్య, సంఘీ రాజు, పిక్క గణేష్, వడ్డేమాన్ బాలరాజ్, ఘనగాని మల్లేష్, బొప్పిడి యాదగిరి, చెన్న రాజేష్, కాసుల నరేష్, మొరిగాడి పుష్ప, స్వరూప, చంద్రకళ, ఘనగాని భాగ్యమ్మ, అయిలి అంజమ్మ, మొరిగాడి మంజుల, అనిత, ఎండి మతిన్, ఎండి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -