Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓడిఎఫ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

ఓడిఎఫ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

- Advertisement -

కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి 
కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోర్స్ రద్దు చేయాలి
ఈ నెల 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు అతిమేల మానిక్
నవతెలంగాణ – కంది 

మండలంలోని ఎద్దుమైలారం గ్రామ శివారులోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడిఎఫ్) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ 26,000 పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అతిమేల మానిక్ సోమవారం కేంద్ర ప్రభుత్వనాని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి చేస్తుందని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు. పర్మినెంట్ అనేది లేకుండా చేసి ఎఫ్టిఈ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుంది అని అన్నారు. ఈ నెల 12న జరిగే దేశ వ్యాప్త సభలో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఓడిఎఫ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,మెడికల్, ఇన్సూరెన్స్, షూ యూనిఫాం క్యాంటీన్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలనీ ఉద్యోగ బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు హక్కులను ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రాజు సిఐటియు సీనియర్ నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -