దొంగతనం చేసిన సొత్తు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నవతెలంగాణ – రామారెడ్డి
జిల్లాలోని రామారెడ్డి తో పాటు మాచారెడ్డి మండల పరిధిలో గత శుక్రవారం రాత్రి ఆలయాల్లో ఉండి పగలగొట్టి నగదు తో పాటు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరాయపల్లి పెద్దమ్మ దేవాలయం, రెడ్డిపేట ఎల్లమ్మ దేవాలయం, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాయిపేట్ ఎల్లమ్మ ఆలయంలో హుండీ డబ్బులతో పాటు ఆలయంలోని బంగారం వెండి ఎత్తుకెళ్లిన దుండగులను, ఎస్పీ ఆదేశాల మేరకు తీరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు టీములుగా విచారణ చేపట్టి ఇద్దరు నిందితులైన డిచ్ పల్లి కి చెంది రుద్ర బోయిన గణేష్, కామారెడ్డికి చెందిన నిమ్మ బోయిన సురేష్ లను విచారించగా చేసిన దొంగతనాన్ని ఒప్పుకోవడంతో, సొత్తును, బంగారo, వెండి, 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్, స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపినట్లు ఏ.ఎస్.పి శ్వేతా తెలిపారు. కార్యక్రమంలో సిఐ రామన్, రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్, మాచారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బంది సిద్ధిరాములు, రాజు తదితరులు ఉన్నారు.
ఇద్దరు దొంగలు అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



