Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు కంటి పరీక్షలు

విద్యార్థులకు కంటి పరీక్షలు

- Advertisement -

విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది
నవతెలంగాణ – ఆలేరు రూరల్

మండలం టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్రీయ బాల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల కంటి చూపును పరీక్షించాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి చూపు లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి తగు సూచనలు, అవసరం ఉన్నవారికి ఉచిత కళ్లద్దాలు అందజేయనున్నట్లు  ప్రైమరీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి తెలిపారు.

విద్యార్థులు ఎక్కువసేపు మొబైల్ టీవీ చూస్తే కలిగే పరిణామాలపై అవగాహన కల్పించారు. చదువుతున్న సమయంలో సరైన వెలుతురు ఉండాలని, పుస్తకానికి కంటికి మధ్య అవసరమైన దూరాన్ని పాటించాలని కంటి చూపు మెరుగుపరచడానికి విటమిన్ ఏ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని అన్నారు. డాక్టర్ జయంత్,డాక్టర్ అనూష,స్కూలు ప్రధానోపాధ్యాయులు కోడం రమాదేవి, ఉపాధ్యాయులు పారామెడికల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -