నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4వ విడత సామాజిక తనిఖీ గ్రామసభలు సోమవారం నిర్వహించారు. మండలంలోని బేగంపేట,కొత్తపల్లి,చిన్న మసాన్ పల్లి,తిమ్మక్క పల్లి, మంతూరు,గొల్లపల్లి, ముంగిసపల్లి,రాయపోల్,సయ్యద్ నగర్, పెద్ద ఆరేపల్లి గ్రామాల్లో ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పనుల అమలు, కూలీల హాజరు, చెల్లింపులు,పనుల నాణ్యత తదితర అంశాలపై సామాజిక తనిఖీ బృందాలు పరిశీలన చేపట్టాయి.
గ్రామస్థులు తమ అభిప్రాయాలు, సూచనలు,ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్రామసభల్లో డీఆర్‌పీలు, బీఆర్‌పీలు,సంబంధిత అధికారులు పాల్గొని వివరాలు సేకరించారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామస్థులు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు మాసాన్ పల్లి రాజు,మద్ద గీత ప్రవీణ్,పర్వేజ్,అశోక్, లక్ష్మీ రవి,షేక్ రుబిన,దివ్య,వివిధ గ్రామాల సెక్రెటరీలు,పిల్డ్ అసిస్టెంట్ లు,ఉపాది హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
కూలీలకు పని కల్పించడమే ఉపాధి హామీ పథకం ఉద్ధేశ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



