Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తో పూరి గుడిసె దగ్ధం

విద్యుత్ షాక్ తో పూరి గుడిసె దగ్ధం

- Advertisement -

– రూ.2 లక్షల ఆస్తి నష్టం.
నవతెలంగాణ – రాయపోల్

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో పూరిగుడిసె దగ్దమైన సంఘటన రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింలు నివాసముంటున్న గుడిసె విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో గుడిసెలో ఉన్న గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గుడిసెలో భద్రపరిచిన విలువైన పత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని తెలిపాడు.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో నిరాశ్రయులైన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్థులు, అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -