Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమాళ్ల కృష్ణ అన్నారు. సోమవారం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. గ్రామానికి చిందిన దెంది శ్వేతకు రూ.34,500, పసుపుల వెంకటేశ్  పేరిట మంజూరైన రూ.17వేల చెక్కులను  గ్రామ సర్పంచ్ అనూషతో  బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. 

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి ప్రసాదాచారి, ఏ ఏం సి డైరెక్టర్ కృష్ణ ,  వార్డు సభ్యులు మల్లేష్ యాదవ్ , శ్రీధర్ ప్రసాద్, రాఘవేందర్ , అనిల్ నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -