Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం 

చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం 

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి
సీఎం కప్ 2025 – 26 ఎడిషన్ 2లో భాగంగా శనివారం ఎం జె బి హాస్టల్ హబ్సిపూర్ లో జరిగిన దుబ్బాక నియోజకవర్గ స్థాయి కబడ్డీ  వాలీబాల్ పోటీల్లో అక్బర్ పేట భూంపల్లి మండలం మూడు క్రీడలలో ప్రభంజనం సృష్టించారు. వాలీబాల్ కబడ్డీ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ యొక్క పోటీల్లో 9 మండలాల నుంచి క్రీడాకారులు క్రీడాకారీని లు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా బాలికల విభాగంలో వాలీబాల్ ఖాజీపూర్ విద్యార్థినిలు ప్రథమ స్థానం సాధించారు. కబడ్డీ లో భూంపల్లి విద్యార్థినిలు ద్వితీయ స్థానం సాధించారు బాలుర విభాగంలో భూంపల్లి  విద్యార్థులు వాలీబాల్ ద్వితీయ స్థానం సాధించారు. ఈ క్రీడలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాలలోని పిడి నరేష్ పిఈటి వెంకటరెడ్డిని ఉపాధ్యాయుల బృందం అభినందించింది. కార్యక్రమంలో భూంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బి రాజేందర్, కాజిపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, భాగ్యమ్మ, స్వామి, దయాసాగర్ రెడ్డి, రవి, శేఖర్, పెంటయ్య, భాగ్యవతి, సంతోషి, రాజశ్రీ, మేఘమాల, విద్యార్థులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -