Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమాఅందర్నీ మెప్పించే 'ఫంకీ'

అందర్నీ మెప్పించే ‘ఫంకీ’

- Advertisement -

హీరో విశ్వక్‌ సేన్‌, దర్శకుడు కె.వి. అనుదీప్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది. సోమవారం సాయంత్రం తిరుపతిలో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. గీతావిష్కరణ కార్యక్రమంలో హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ‘ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ఈ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్‌ ఎంటర్టైనర్‌. మీ కుటుంబంతో కలిసి థియేటర్‌కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈనెల 13న థియేటర్లలో కలుద్దాం.

మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు’ అని అన్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఈనెల 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాల విందుని అందించనుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌, నరేష్‌, వీటీవీ గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం, రచన: అనుదీప్‌ కె.వి, మోహన్‌, కళా దర్శకుడు: జానీ షేక్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -