తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రాబోతున్నారు. ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ వేసవిలో సినిమా విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ,’కొంతమందికి అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి. దానికి చాలా నవ్వుకునే కారణాలు ఉంటాయి. నిజంగా అదొక ప్రపంచం.
ఇలాంటి కథతో కశ్యప్ వచ్చినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఆ యూనిక్ ట్రీట్మెంట్‌కి ఫిదా అయిపోయాను. ఆడియన్స్ కూడా ఫిదా అవుతారని నమ్మకం ఉంది. స్క్రీన్‌లో చూసినప్పుడు నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ధియేటర్లలో లాఫ్ రైడ్ ఉంటుంది’ అని అన్నారు. ‘సినిమాని ఒక ఆడియన్‌గా విన్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది. డైరెక్టర్ చాలా చక్కగా తీశారు’ అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పారు. డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ,’ఓ యూనిక్ కథతో మీ ముందుకు రాబోతున్నాం’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ,’ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మాతో జి స్టూడియోస్ కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.
థియేటర్లలో నవ్వులే నవ్వులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



