– లేక్ షోర్ మాల్, కూకట్ పల్లిలో 9- స్క్రీన్ సినిమా ప్రారంభంతో
– Gen Z కోసం రూపొందించబడిన, మల్టిప్లెక్స్ సౌకర్యం, టెక్నాలజీ , ప్రపంచ స్థాయికి చెందిన సినిమా అనుభవాన్ని సమ్మేళనం చేసింది
నవతెలంగాణ – హైదరాబాద్ :
హైదరాబాద్, ఫిబ్రవరి 09, 2026: హైదరాబాద్ లో తమ ఉనికిని మరింత శక్తివంతం చేస్తూ లేక్ షోర్ మాల్, వై-జంక్షన్, కూకట్ పల్లిలో తమ కొత్త 9-స్క్రీన్ సినిమా ఆరంభం గురించి PVR INOX, భారతదేశపు ప్రముఖ మల్టిప్లెక్స్ చెయిన్, ఈరోజు ప్రకటించింది. ఇది నగరంలో కంపెనీ వారి 19వ సినిమాను సూచించింది ,హైదరాబాద్ లో మొత్తం PVR INOX స్క్రీన్ కౌంట్ ను 119 స్క్రీన్స్ కు చేర్చింది.
కొత్తగా ఆరంభించబడిన మల్టిప్లెక్స్ లో మొత్తం 1,476 సీట్ల సామర్థ్యంతో 9 ఆధునిక ఆడిటోరియంలు ఉన్నాయి. విభిన్నమైన ప్రేక్షక వర్గాల కోసం రెండు విలక్షణమైన రూపాల్లో ఏర్పాటు చేయబడ్డాయి.
· PXL, PVR INOX లు యొక్క పెద్ద-ఫార్మాట్ స్క్రీన్, టెంట్ పోల్ బ్లాక్ బస్టర్స్ , ఈవెంట్ సినిమా కోసం రూపొందించబడిన శక్తివంతమైన, లీనమయ్యే అనుభవాన్ని అందిస్తోంది.
సినిమా PVR INOX యొక్క సరికొత్త సినిమా ఫుడ్ కోర్ట్ భావనను కూడా పరిచయం చేస్తోంది. ఈ ఫుడ్ కోర్టులో వివిధ కౌంటర్లు, క్విక్-సర్వీస్ ఫేవరెట్స్, తాజా ఆఫరింగ్స్ ఉంటాయి. ఆకర్షణీయమైన, సాంఘిక ప్రదేశంగా రూపొందించబడిన ఫుడ్ కోర్ట్ పరస్పరం అనుభవాలు పంచుకోవడానికి, సౌకర్యం , షోలకు ముందు , తరువాత సాధారణంగా భోజనాలు చేయడానికి ప్రాధాన్యతనిచ్చే Gen Zకు అనుగుణంగా రూపొందించబడింది.
ఈ ప్రారంభోత్సవం గురించి వ్యాఖ్యానిస్తూ, అజయ్ బిజ్లీ, మేనేజింగ్ డైరెక్టర్, PVR INOX లిమిటెడ్ ఇలా అన్నారు:
“లీనమయ్యే, సామాజిక, మరియు ఉన్నతమైన నాణ్యత గల అనుభవాలను కోరుకునే శక్తివంతమైన యువత , Gen Z ప్రేక్షకులతో హైదరాబాద్ చురుకైన, ఆధునికమైన సినిమా మార్కెట్. కూకట్ పల్లి కీలకమైన జీవనశైలి కేంద్రంగా వేగంగా అభివృద్ధిచెందుతోంది , లేక్ షోర్ మాల్ లో మా కొత్త 9- స్క్రీన్ సినిమా సినిమాలకు వెళ్లడం మరింత అందుబాటులో ఉండటం, మరింత సంబంధాన్ని కలిగి ఉండటం మరియు ఆధునిక తరానికి చెందిన ప్రేక్షకుల కోసం ఉత్తేజభరితం చేయడానికి సాంకేతికత, సౌకర్యం , కూర్పు చేసిన ఫార్మాట్స్ యొక్క కలయికపై మా దృష్టి కేంద్రీకరణను సూచిస్తోంది.”
సంజీవ్ కుమార్ బిజ్లీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, PVR INOX లిమిటెడ్, ఇలా అన్నారు: “ ప్రీమియం ఫార్మాట్స్ సౌండ్ నుండి సరళమైన సీటింగ్ సామాజిక ఆహార ప్రదేశ వరకు పెరుగుతున్న ప్రేక్షకుల ప్రాధాన్యలతో అనుగుణంగా ఉండటానికి ఈ సినిమా రూపొందించబడింది. కుటుంబాలు కావచ్చు, ఉద్యోగస్థులు కావచ్చు, లేదా వివిధ భాషలు మరియు సంస్కృతులలోని కంటెంట్ ను కనుగొనే సినిమాలను ప్రేమించే Gen Z తరం వారు కావచ్చు, కూకట్ పల్లి సినిమా నేటి జీవనశైలిలో సజావుగా కలిసిపోయే సమకాలీన సినిమా చూసే అనుభవాన్ని అందిస్తుంది.”



