Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకల్తీలేని ఆహారం చేప

కల్తీలేని ఆహారం చేప

- Advertisement -

– రాంనగర్‌ చేపల మార్కెట్‌ను అజామాబాద్‌కు తరలిస్తే బాగుంటుంది
– ట్రాఫిక్‌ సమస్య తగ్గడంతో పాటు బిజినెస్‌ పెరిగే అవకాశం : రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కల్తీ లేని ఆహారం చేప అని రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌ చేపల మార్కెట్‌ను అజామాబాద్‌కు తరలిస్తే బాగుంటుందనీ, ట్రాఫిక్‌ సమస్య తగ్గడంతో పాటు బిజినెస్‌ పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఫిష్‌ మార్కెట్‌ను తరలించే ప్రయత్నం చేశామని తెలిపారు. సోమవారం హైదారాబాద్‌లో మత్స్యశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మత్స్యశాఖ ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫిష్‌ స్టాల్స్‌ వాహనాలను అందజేసిన విషయాన్ని కమిషన్‌కు వివరించిన ఫిషరీస్‌ డైరెక్టర్‌ నిఖిల తెలిపారు. ఈసారి చేపపిల్లలు, రొయ్యల సీడ్‌ చెరువుల్లో వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేయించామన్నారు. ఈసారి పూర్తి స్థాయిలో నిఘా నీడలో చెరువుల్లో చేపపిల్లలను వేశామని తెలిపారు. సమావేశంలో రైతు కమిషన్‌ సభ్యులు గోపాల్‌ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్‌, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మురళికృష్ణ, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -