Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌పై ఫిర్యాదు

కేటీఆర్‌పై ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీ అగ్ని ప్రమాదం వెనుక సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేశారని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ బి.లింగం యాదవ్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరా బాద్‌ బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిర్యాదు చేశారు. కేటీఆర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదినితో సమావేశమై సీఎంపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

మానసిక పరిస్థితి బాగాలేని కేటీఆర్‌ : మీడియా కమిటీ చైర్మెన్‌ సామ రామ్మోహన్‌ రెడ్డి
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మానసిక పరిస్థితి బాగాలేదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మెన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ విష యాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థం చేసుకోవాలని కోరారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్న ఆధారాలను తగుల బెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తు న్న కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెట్టేంతవరకు వదిలిపెట్టరని తెలిపారు. సిరిసిల్లలోనూ కేటీఆర్‌ ఓడిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -