- Advertisement -
పది గ్రాముల పసిడిపై రూ.1310 పెరుగుదల
రూ.1.58 లక్షలు దాటిన ధర
వెండిదీ అదే దారి
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతోన్నాయి. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.1,310 పెరిగి రూ.1,58,060కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.1200 పెరిగి రూ.1,44,900గా నమోదైంది. పసిడి బాటలోనే వెండి ధరలు ఎగిశాయి. కిలో వెండిపై రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది. అంటే 10 గ్రాముల వెండి ధర రూ.3,000 పలికినట్టయ్యింది. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతుండటంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
- Advertisement -



