12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ : తెలంగాణ జాగృతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉద్యమం నాటి సంగతులను పంచుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జరిగే చర్చలో పాల్గొనేందుకు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు ముందుకు రావాలని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మాట్లాడారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అవకాశాలు దక్కాయా? అనేది అవలోకనం చేసుకోవాల్సిన అసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించే ఆత్మగౌరవ సభలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకులు దండెం ఆనందం, పాండు రంగారెడ్డి, శశిధర్, లింగం తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యాచరణ చర్చలో పాల్గొనండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



