పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
బీహెచ్‌ఈఎల్‌లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సదస్సు
నవతెలంగాణ-రామచంద్రాపురం
లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక లోకం కన్నెర్ర చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో గల బీహెచ్‌ఈఎల్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమ్మె సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా బీహెచ్‌ఈఎల్ సీఐటీయూ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ రంగం ఉంటేనే కార్మికులకు హక్కులు, చట్టాలు నిలబడతాయన్నారు. పాలకులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని ఆదానీ, అంబానీలకు ధారదత్తం చేస్తున్నారని విమర్శించారు.
లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు కార్మిక లోకం కన్నెర్ర జేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ కార్మికులు పోరాడలేరనే విమర్శ పోవాలని, దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగాలలో పోరాటాలు జరిగాయని, విజయాలు సాధించారని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో విద్యుత్ కార్మికుల పోరాటం, కర్నాటకలో శాంసంగ్ కార్మికుల పోరాటం, మహారాష్ట్రలో రైతన్న పోరాటాలు ఇటీవల కాలంలో విజయాలు సాధించాయని అన్నారు. ఈ సదస్సులో ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రెటరీ మహిపాల్ రెడ్డి, హెచ్‌ఎంఎస్ మాజీ అధ్యక్షులు కంది శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కోశాధికారి కే.రాజయ్య, ఎస్సీ అసోసియేషన్ అధ్యక్షులు సురేందర్ లు మాట్లాడారు. ఈ సదస్సులో ఐఎన్‌టీయూసీ నాయకులు కె.మధు, నాయకులు గడ్డం శ్రీనివాస్, స్వామి, నరేందర్, సీఐటీయూ నాయకులు నాగులు భాషా, పెంటయ్య, శ్రీనివాస్, కుమారస్వామి, లింగరాజు, తుకారాం పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌ల రద్దుకు కార్మిక లోకం కన్నెర్ర చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



