- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : ఉప్పార్పల్లి గ్రామానికి చెందిన పిట్ల రాజయ్య మరణించడంతో, వారి ఖర్మకాండల నిమిత్తం ఎస్సార్ ఫౌండేషన్ (సుభాష్ రెడ్డి) ద్వారా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసి, ఇలాంటి సమయంలో అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పార్పల్లి గ్రామ సర్పంచ్ , వార్డు సభ్యులు, జనగామ గ్రామ ఉప సర్పంచ్ స్వామి, ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



