Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూముల రీసర్వేతో సమస్యలు పరిష్కారం 

భూముల రీసర్వేతో సమస్యలు పరిష్కారం 

- Advertisement -

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 
నవతెలంగాణ – అచ్చంపేట
భూముల రీ సర్వే తో రైతుల భూములకు సంబంధించిన హద్దులు బహిర్గతం అవుతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం లింగాల మండలం అంబటిపల్లి గ్రామపంచాయతీలో భూభారతి పథకంలో భాగంగా భూముల రీసర్వే పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రతి  భూమి రీ సర్వే చేయడం జరుగుతుంది. భూముల రీ సర్వే కార్యక్రమంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రీ సర్వే ద్వారా భూముల సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించబడతాయని, భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు. రైతులు, భూమి యజమానులు ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ , రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -