నేడు పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ ఢ
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ రేసు రక్తికట్టగా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వేటలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోరు చేసినా ఓటమి పాలైన సన్‌రైజర్స్ ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. యువ పేసర్లకు అవకాశం అందించి అద్భుతాలు రాబట్టింది. మరో వైపు పంజాబ్ కింగ్స్ రెండు పరాజయాలతో సతమతం అవుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌కు డోకా లేదు కానీ టాప్-2లో నిలిచే అవకాశాలను మరో ఓటమి దెబ్బకొట్టగలదు. సొంతగడ్డపై నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ అచ్చొచ్చిన ఉప్పల్‌లో పుంజుకునేందుకు ఎదురుచూస్తోంది. ఇటు సన్‌రైజర్స్ హైదరాబాద్, అటు పంజాబ్ కింగ్స్ గెలుపు బాట పట్టాలని భావిస్తుండగా ఈ రెండు జట్లు నేడు ఉప్పల్ స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి.
బ్యాటర్లు మెరవాలి
విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లను కాపాడుకుంటూ.. పరుగుల వేటలో ముందుండి నడిపించాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో క్లాసెన్ ఆరంభంలోనే వికెట్ కోల్పోవటంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపించింది. 105/1 నుంచి 165కు ఆలౌటైంది. 60 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ మిడిల్ ఆర్డర్‌లో రాణించటం సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకం. ఆల్‌రౌండర్‌గా గొప్పగా రాణిస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి జ్వరంతో గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. మంగళవారం ప్రాక్టీస్‌లో కనిపించిన నితీశ్ నేడు బరిలోకి దిగనున్నాడు. నితీశ్, క్లాసెన్ నిలిస్తే మిడిల్ ఆర్డర్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. అభిషేక్ శర్మ, ట్రావిశ్ హెడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ సైతం నిలకడగా పరుగులు చేస్తున్నాడు. యువ బ్యాటర్లు సాలీల్ అరోరా, అనికెత్ వర్మలు ఒత్తిడిలో పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ లైనప్‌లో ఈషన్ మలింగ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారాడు. సీజన్లో పది మ్యాచ్‌లు ఆడిన ఈషన్ మలింగ గత మ్యాచ్‌లో నిరాశపరిచాడు. నేడు పంజాబ్ కింగ్స్‌పై సత్తా చాటాలని మలింగ ఎదురుచూస్తున్నాడు. సకిబ్ హుస్సేన్, పాట్ కమిన్స్, నితీశ్ కుమార్‌లతో కలిసి ఈషన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. శివాంగ్ కుమార్ స్పిన్ మాయ చేస్తున్నా.. ప్రత్యర్థులపై మరింత ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
బౌలర్ల ఫామ్ ఆందోళనకరం
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ ప్రమాదకరంగా ఉంది. టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్ కింగ్స్.. పేలవ బౌలింగ్‌తో గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్‌లు ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. సన్‌రైజర్స్‌తో గత మ్యాచ్‌లోనూ పార్ట్ టైమ్ బౌలర్ శశాంక్ సింగ్ అనూహ్యంగా ట్రావిశ్ హెడ్, అభిషేక్ వికెట్లు పడగొట్టడంతో బౌలర్లు ఊపిరీ పీల్చుకున్నారు. విజరుకుమార్ వైశాక్ మెప్పిస్తున్నా.. జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వెంద్ర చాహల్ సైతం వికెట్ల వేటలో సహకారం అందించాల్సి ఉంది. ప్రభుసిమ్రన్ సింగ్, ప్రియాన్షు ఆర్యలు భీకర ఫామ్‌లో ఉన్నారు. దేశవాళీ ఓపెనింగ్ జోడీని నిలువరించటం అంత సులువు కాదు. శ్రేయస్ అయ్యర్, కూపర్ కానొలి, మార్కస్ స్టోయినిస్‌తో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా ఉంది. ముల్లాన్‌పూర్ తరహాలోనే నేడు ఉప్పల్‌లోనూ పరుగుల వరద పారనుంది. అయితే, పంజాబ్ కింగ్స్‌ను బోల్తా కొట్టించేందుకు సన్‌రైజర్స్ నేడు తొలుత బౌలింగ్ చేస్తుందేమో చూడాలి.
పుంజుకుంటారా?
- Advertisement -
- Advertisement -



