నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్‌రెడ్డి, మర్రిరాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, జగదీశ్‌రెడ్డి, అనిల్ జాదవ్, సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు. మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు.
శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



