- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చెక్కులపై ఉపసర్పంచ్లు సంతకాలు చేయడంలో జాప్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెక్కుపై సర్పంచ్ సంతకం అయ్యాక ఉప సర్పంచ్ సంతకం చేయడానికి వారం రోజుల సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఉప సర్పంచ్ వారం రోజుల్లో సంతకం చేయకుంటే.. ఆ పనికి సంబంధించిన బిల్లుకు కలెక్టర్ ప్రొసిడింగ్ జారీ చేసే అధికారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేయనున్నారు. కాగా ఉప సర్పంచ్ల చెక్ పవర్‌ను రద్దు చేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



