- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఉద్రిక్తతకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి సహా పలువురు నేతలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారి ఎదుట టీషర్టులు విప్పి అభ్యంతరకరంగా ప్రవర్తించారని మహిళా సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, ఫొటోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీడియో ఆధారాల విశ్లేషణ అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -


