Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో జర్నలిస్ట్‌ అరెస్ట్‌

యూపీలో జర్నలిస్ట్‌ అరెస్ట్‌

- Advertisement -

ముఖ్యమంత్రి యోగిపై అభ్యంతరకరమైన పోస్ట్‌ చేశారని ఆరోపణలు
లక్నో :
మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక జర్నలిస్ట్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకరమైన ఇమేజ్‌ను పోస్ట్‌ చేశారంటూ జర్నలిస్ట్‌ పవన్‌ తివారీని అరెస్ట్‌ చేశారు. బీజేపీ హనుమాన్‌గంజ్‌ మండల్‌ ప్రధాన కార్యదర్శి అమ్రిష్‌కుమార్‌ పాండే దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 196(1)(బి) (మతం, జాతి, స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. పవన్‌ తివారీ ఆదివారం ఫేస్‌బుక్‌లో యూపీ ముఖ్యమంత్రి అభ్యరంతరకరమైనచిత్రాన్ని పోస్ట్‌ చేశాడని, వివాదాస్పద క్యాప్షన్‌ కూడా ఉందని అన్నారు. ఈ పోస్ట్‌ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా, అశాంతిని వ్యాప్తి చేసేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టేందుకు ఉద్దేశించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -