నాసిరకం విత్తనాలను అరికట్టండి : వ్యవసాయ అధికారులను ఆదేశించిన రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విత్తనోత్పత్తి క్షేత్రాల నుంచి రైతులకు మేలైన విత్తనాలు అందేలా చూడాలనీ, నాసిరకం విత్తనాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయనీ, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్‌లో వివిధ రకాల విత్తనాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్టు కమిషన్‌కు అధికారులు వివరించారు. ప్రధానంగా వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. విత్తనోత్పత్తిని పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులను ఏర్పాటు చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ చేయాలని సూచించారు. ఎక్కడైనా భూ సమస్యలు వున్న చోట.. ఆ విషయాలను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దష్టికి, ప్రభుత్వ దష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్‌రెడ్డి, గోపాల్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ తోపాటు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్‌కు చెందిన అగ్రికల్చర్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతులకు మేలైన విత్తనాలివ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



