నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం డివిజన్ పరిధిలో మంగళవారం స్వల్పంగా భూమి కంపించడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అయితే ఇది భూకంపమని సంబంధిత అధికారులు నిర్ధారించలేదు. స్థానికుల వివరాల ప్రకారం.. డివిజన్‌లోని మెట్టుకానిగూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఉదయం 10:15 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించడంతో ఆయా ప్రాంతాలవాసులు, పలు పాఠశాలల విద్యార్థులు ఒక్కసారిగా భూకంపం వచ్చిందని భయాందోళనలతో ఉరుకులు.. పరుగులు.. తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపించేశారు. భారీ శబ్దంతో భూమి కంపించడంతో ఉలిక్కిపడ్డామని పలు బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు తెలిపారు. ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా? లేక ఏదైనా భారీ పేలుడు పదార్థాలతో సంభవించిందా అనే కోణంలో జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గాజులరామారంలో స్వల్పంగా భూ ప్రకంపనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



