– గార్లలో కరెంట్ షాక్ ఇచ్చి..
– కల్వకుర్తిలో లైంగికదాడి.. ఆపై హత్య
నవతెలంగాణ – గార్ల, కల్వకుర్తి
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో అత్తలను అల్లుళ్లు హత్య చేసిన దారుణ ఘటనలు మంగళ వారం చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్లలో కరెంట్‌షాక్ ఇచ్చి చంపేయగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో లైంగికదాడి చేసి ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళి తండాకు చెందిన బానోత్ రాజేష్‌కు తొమ్మిదేండ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సమీపంలోని బేతాలంపాడుకు చెందిన ధారావత్ కౌసల్య-రాందాస్‌ల కుమార్తె జ్యోతిని ఇచ్చి వివాహం జరి పించారు. ఈ క్రమంలో తన సోదరుడైన బానోత్ రమేశ్‌కు కౌసల్య సోదరుడి కుమార్తెనిచ్చి మూడ్రోజుల క్రితం వివాహం జరిపించారు. తన సోదరుడికి వివాహం జరగ కుంటే అతని వాటా వ్యవసాయ భూమి తన సొంతమయ్యేదని, ఆ ఆస్తి దక్కకుండా తన అత్తామామలే సోదరుడికి రెండో వివాహం చేశారని వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమం లో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులందరూ నిద్రలో ఉండగా మామ రాందాస్‌కు ముందుగా విద్యుత్‌షాక్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. మామ చనిపో యాడని భావించిన రాజేష్ అత్త కౌసల్యకు విద్యుత్‌షాక్ ఇవ్వడంతో ఆమె అక్కడిక క్కడే మృతిచెందింది. ఈ క్రమంలో ఇంట్లో శబ్దాలు కావడంతో ఉలిక్కిపడిన అంజలి, జ్యోతి లేచి చూసేసరికి కౌసల్య మృతి చెందింది. రాందాస్ ప్రాణాపాయస్థితిలో ఉండడంతో భయాందోళన లతో కేకలు వేస్తూ అడ్డుకునే యత్నం చేశారు. మరింత కోపోద్రిక్తుడైన రాజేష్ వదిన అంజలి, భార్య జ్యోతిలపై అక్కడే ఉన్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ గాయపడ్డారు. రాజేష్ ఇంట్లో నుంచి అరుపులు, ఏడుపులు వినిపించడంతో చుట్టు పక్కల వారు నిద్రలేచి ఘటనాస్థలానికి చేరుకు న్నారు. పరిస్థితి గమనించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్‌పీ తిరుపతిరావు, గార్ల-బయ్యారం సీఐ రవీందర్, ఎస్‌ఐ బి.సాయి కుమార్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా డోర్నకల్, బయ్యారం ఎస్‌ఐలు పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అత్తపై అల్లుడు లైంగికదాడి …ఆపై హత్య
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట గ్రామానికి చెందిన చెన్నమ్మ(65)ను అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ సోమవారం రాత్రి లైంగికదాడి చేసి హత్య చేసినట్టు స్థానిక సీఐ నాగార్జున తెలిపారు. తిమ్మాజిపేట మండలానికి చెందిన రాఘవేందర్ రఘుపతిపేట గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. మద్యం సేవించి తరచూ భార్యను వేధిస్తుండడంతో ఆమె అక్క దగ్గరికి వెళ్ళింది. సోమవారం రాత్రి మద్యం మైకంలో ఒంటరిగా ఉన్న అత్తపై రాఘవేందర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా అరవడంతో హత మార్చాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాఘవేందర్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించి నట్టు సీఐ తెలిపారు. 24 గంటల్లో పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వివరించారు.
అత్తలను చంపిన అల్లుళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



