– మహాప్రస్థానం వాహనం లేక… ఆటోకు డబ్బులు లేక…
– సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం
బాపట్ల : మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక బైక్‌పై తరలించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఈ హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… ఎస్‌టి సామాజిక తరగతికి చెందిన నక్క నాగేశ్వరరావు (40) వరి పొలాల వద్ద ఉంటూ ఎలుకల బోనులు పెడుతూ ఉంటారు. మంగళవారం ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో, నాగేశ్వరరావు సోదరు లు ఆయనను ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనం లేకపోవడంతో మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తరలించడానికి సంప్రదించారు. ఇందుకు మూడు వేల రూపాయలు బాడుగ అడగడంతో పేదలైన వారు ఆ మొత్తం చెల్లించలేక మృతదేహాన్ని పది కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లారు. బాపట్ల జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో వారు గుడెసెలు ఉన్నాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ స్పందించి సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల ఏరియా ఆస్పత్రిలో ‘మహాప్రస్థానం’ వాహనం లేదని తెలిపారు. దీనిని మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో బైక్‌పై మృతదేహం తరలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



