Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం కేర్స్‌ నిధులపై మాట్లాడకుండా ఎలా ?

పీఎం కేర్స్‌ నిధులపై మాట్లాడకుండా ఎలా ?

- Advertisement -

వాటిపై పార్లమెంట్‌కు ప్రశ్నించే హక్కు వుంది : సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిట్టాస్‌
న్యూఢిల్లీ :
పీఎం కేర్స్‌, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ వంటివి ప్రభుత్వానికి సంబంధించినవి కావని, అందువల్ల వాటిపై పార్లమెంట్‌ ప్రశ్నించరాదని ప్రభుత్వం వాదిస్తోంది. పిఎం కేర్‌ ఫండ్‌పై ప్రశ్నించడానికి పార్లమెంట్‌కు ఎలాంటి హక్కు లేదా విశేషాధికారం లేదని ప్రధాన మంత్రి కార్యాలయం చెబుతోంది. ఆ నేపథ్యంలో దీనిపై సీపీఐ(ఎం) సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌ తీవ్రంగా స్పందించారు. పిఎం కేర్స్‌ను భారత ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని 2020 మార్చి 28న జారీ చేసిన ఆఫీస్‌ మెమోరాండం పేర్కొంటోందని బ్రిట్టాస్‌ గుర్తుచేశారు. పైగా దీన్ని షెడ్యూల్‌ 7లో పొందుపరిచారు. ఇందుకోసం కంపెనీల చట్టాన్ని సవరించారు. అంటే చట్టం ద్వారా ఇది సిఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ-కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) అర్హత పొందిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర చట్టంలో రాయబడిన ఫండ్‌ని అదే సమయంలో ‘ప్రైవేటు’గా వుంచలేమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -