Wednesday, February 11, 2026
E-PAPER
Homeబీజినెస్ఒప్పో నుంచి కొత్త కె14ఎక్స్‌ 5జీ విడుదల

ఒప్పో నుంచి కొత్త కె14ఎక్స్‌ 5జీ విడుదల

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో సోమవారం ఒప్పో కె14ఎక్స్‌ 5జీ మోడల్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ 6.75 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, 120 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుం దని పేర్కొంది. 6500 ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 45వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతును ఇస్తుందని తెలి పింది. ఫోన్‌ వెనుక 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15పై పనిచేసే ఈ ఫోన్‌ ప్రారంభ ధరను రూ.14,999గా నిర్ణ యించింది. ఫిబ్రవరి 16 నుంచి ఆఫ్‌ లైన్‌, ఆన్‌లైన్‌లో లభిస్తుందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -