– ఇరాన్ నుంచి అక్రమంగా దిగుమతులు
– అమెరికా ట్రెజరీ విచారణ
– అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల పతనం
న్యూఢిల్లీ : వరుసగా పలు అంతర్జాతీయ ఉల్లంఘనలకు పాల్పడుతోన్న అదానీ గ్రూప్‌ను తాజాగా అమెరికా ఆంక్షల ఉల్లంఘన ఉచ్చు బిగిస్తోంది. ఇరాన్‌తో ముడిపడి ఉన్న రహస్య లావాదేవీలపై అమెరికా ట్రెజరీకి చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసీ) సివిల్ విచారణ ప్రారంభించినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్వయంగా అంగీకరించింది. ఇరాన్‌తో జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలపై అమెరికా ఏజెన్సీ ప్రస్తుతం సివిల్ విచారణ జరుపుతున్నట్టు మంగళవారం రెగ్యులేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకుంటూనే.. ఆ దేశం ఆంక్షలు విధించిన ఇరాన్ వంటి పక్షాలతో అదానీ సంస్థలు వ్యాపారాలు చేశాయి. అమెరికా వ్యవస్థలను తప్పుదోవ పట్టించి షిప్పింగ్ మార్గాలను మార్చడం ద్వారా ఇరాన్ నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంది. తనపై ఉన్న లంచం కేసులను మాఫీ చేయించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ద్వారా అదానీ ప్రయత్నిస్తున్న వేళ ఈ కొత్త విచారణ మరింత చిక్కుల్లో పడేసినట్లయ్యింది.
ఈ తాజా విచారణ అదానీ గ్రూప్‌నపై మరింత అంతర్జాతీయ ఒత్తిడిని పెంచనుంది. ఒకవైపు హిండెన్‌బర్గ్ ఆరోపణలు, మరోవైపు విదేశీ లంచం కేసులతో సతమతమవుతున్న గౌతమ్ అదానీకి ఈ ఆంక్షల ఉల్లంఘన విచారణతో మరింత గడ్డుకాలన్ని ఎదుర్కోనుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విచారణతో తమపై ఆర్థిక ప్రభావం ఉండబోదని ఆ కంపెనీ చెబుతున్నప్ప టికీ.. గ్లోబల్ మార్కెట్‌లో గ్రూప్ ప్రతిష్ట దిగజారు తోంది. ఈ వార్తతో వెంటనే 3 శాతం పడిపోయిన అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్ తుదకు 1.10 శాతం కోల్పోయి రూ.2,225 వద్ద ముగిసింది.
అదానీ గ్రూపు యూఎస్ ఆంక్షల ఉల్లంఘన..!
- Advertisement -
- Advertisement -



