– కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యన ఘర్షణ
– గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ అభ్యర్థి
– సీతారాంపేట చేరుకున్న బీఆర్ఎస్ నేత బంటి
– పోలీసుల చర్య పై ఆందోళన
– కాంగ్రెస్ అభ్యర్థికి వేరే గ్రామాల నేతల డబ్బుల పంపిణీ చేస్తున్నారని ఆరోపణ..
– వారిని బయటకు పంపాలని డిమాండ్
– పోలీసులే దగ్గరుండి సహకరిస్తున్నారని విమర్శ
– గ్రామ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతల ఆందోళన
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ముందే సీతారాంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల చర్లపై భారీ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇతర గ్రామాల నాయకులను బయటికి పంపించకపోతే ఇక్కడే బైటాయిస్తానని బీఆర్ఎస్ నేత బంటి ఆద్వర్యంలో కార్యకర్తలు ఆందోళన దిగారు. దాంతో సీతారాంపేటలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో అర్ధరాత్రి సీతారాంపేటలో యుద్ధాన్ని తలపించే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు సంబంధించిన వివరాలు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డుపై ఎవరి అంచనాల వారికే ఉన్నాయి. ఇగ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఇరు పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీకి తెరలేపారు.
కాగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టేకుల సుదర్శన్ రెడ్డిని మాత్రం ప్రచారానికి సమయం మించిపోయిందని బయటకు రావద్దని పోలీసులు తన ఇంటిలోకి పంపించేశారు. ఆయనను ఇంట్లో నుంచి బయటికి రానియ్యకుండా అడ్డుకున్నారని, ఇదే తరుణంలో ఒక్కసారిగా అబ్దుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు దాదాపు ఐదారు వాహనాల్లో గ్రామంలోకి వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని తన పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వడంతో భారీ స్థాయిలో మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలతో ఒక్కసారిగా సీతారాంపేట గ్రామానికి చేరుకున్నారు. టేకుల సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీస్ పికెటింగ్ వద్దకు చేరుకొని పరిస్థితిపై పోలీసులు నిలదీశారు. ఓ పక్క అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయిస్తూ.. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఉన్న తనని మాత్రం గృహ నిర్బంధంలోకి నెట్టడం ఏమిటని నిలదీశారు. అక్కడే తన పార్టీ కార్రోయకర్తలతో రోడ్డుపై బైఠాయించారు. ఇతర గ్రామాలను చెందిన కాంగ్రెస్ నాయకులను గ్రామం నుంచి పంపించకపోతే ఇంటింటి తిరిగి తామే పంపించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుండి పోలీసుల చర్య సరిగ్గా లేదని తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడమే కాకుండా, తమ అభ్యర్థులను కూడా ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు. మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని సముదాయించి గ్రామం నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇతర గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సీతారాంపేటలో ఎవరున్నా, వారిని గ్రామం నుండి పంపించి వేస్తామని ఆందోళన విరమించాలని పోలీసులు సూచించారు. ముందు ఆ గ్రామ నాయకులను గ్రామం నుండి బయటకు పంపించిన తర్వాతనే తాము కూడా తన పార్టీ కార్యకర్తలను గ్రామాన్ని విడిచి వెళ్తానని బీష్మించారు. ఏcp సముదాయించి ఆయనను సీతారాంపేట గేటు వరకు గ్రామానికి తీసుకువచ్చారు. ఇదే క్రమంలో రోడ్డుపైకి వెళుతున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా గల్లిలో డబ్బులు పంపిణీ చేస్తున్న విషయాన్ని గమనించి బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని పడుకునేందుకు ముందుకు ఊరికారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ఒక్కసారి ఆటకాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తనను మొదటి నుంచి ప్రచారం చేసుకొనియకుండా మొదటి నుంచి బయటికి రాకుండా పోలీసులు l, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారు మాత్రం అధికారం పార్టీ అండతో పోలీసుల సహకారంతో డబ్బులు పంపిణీ చేయిస్తూ గ్రామంలో విచ్చలవిడి తనాన్ని సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందే బహిరంగ ప్రచారం నిర్వహించుకోకూడదని, ఇతర గ్రామాలకు చెందిన నాయకులు గ్రామాన్ని విడిచి వెళ్లాలని కచ్చితంగా ఆదేశాలున్న ఎందుకు వారిని పంపించడం నిలదీశారు. అధికార పార్టీ నాయకులు పంపించడం లేదని నిలదీశారు . వారికి ప్రత్యక్షంగా సహకరిస్తూ తమను నిర్బంధంలోకి నెట్టుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు సముదాయించి గ్రామ నుండి వెళ్లిపోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర గ్రామాల నాయకులను బయటకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు విరమించారు. సీతారాంపేట గ్రామంలో భారీ పోలీస్ చీకటి ఏర్పాటు చేశారు. ఒకరిని కూడా ఇతర గ్రామాలకు చెందిన నాయకులను అనుమతించకూడదని బందోబస్తులను పోలీసులను ఏసీపీ కేవీపీ రాజు ఆదేశాలు జారీ చేశారు.



