Thursday, February 12, 2026
E-PAPER
Homeఖమ్మంబోనకల్లులో విజయవంతమైన సార్వత్రిక సమ్మె 

బోనకల్లులో విజయవంతమైన సార్వత్రిక సమ్మె 

- Advertisement -

– భారీగా సమ్మెలో పాల్గొన్న అంగనవాడి, ఆశ, సిఐటియు కార్మికులు 
నవతెలంగాణ – బోనకల్ : కార్మికుల మెడకు ఉరితాడు లాంటి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, మోటార్ వాహన చట్టం 2019ని సవరించాలని, సమ్మె బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టిడబ్ల్యూఎఫ్ ఎ సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలంలో విజయవంతమైంది. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ నుంచి స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శనగా చేరుకున్నారు. అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ గుగులోతు నరేష్, బోయినపల్లి వీరబాబు, తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ నాయకులు కిలారు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి మరీదు పుల్లయ్య, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, అంగనవాడి వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాయల విజయలక్ష్మి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్యోగుల, కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. కార్మికులకు కొద్దిపాటి ఉపశమనాన్ని, భద్రతను కల్పించే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని విమర్శించారు. వీటి ఫలితంగా కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసే హక్కులు కోల్పోతున్నారన్నారు. కేంద్రం లో బిజెపి ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా రంగాలు తీవ్ర సంక్షోభంలో నెట్టబడుతున్నాయన్నారు. రవానరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మహాలక్ష్మి స్కీం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు నెలకు రూ. 4500 ఇవ్వాలని, కార్మికులకు ఉపయోగపడే విధంగా మోటార్ వాహన చట్టం 2019 సవరించాలని, జాతీయ రహదారులపై డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో రోడ్డు పక్కన వసతి సౌకర్యాలు కల్పించాలని, పెట్రోల్, డీజిల్ ధరలు, టోల్ చార్జీలు తగ్గించాలని, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దోపిడీని అరికట్టి జాతీయ బ్యాంకుల ద్వారా చిన్న వాహన యజమానులకు రుణ సౌకర్యం కల్పించాలని వారిని డిమాండ్ చేశారు. అన్ని నిత్యవసర వస్తువులు విద్య ఆరోగ్యం పై ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు వీటి ఫలితంగా కుటుంబాలను పోషించడం భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు రవాణా రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిదని అలాంటి రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వేర్యం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుంటి శ్రీను, భుక్యా శ్రీను, బంధం గోవర్ధన్, అంగన్వాడి కార్యకర్తలు సాతుపాటి రాణి, బానోత్ ఉష, బండి జయమ్మ, రామణ సునీత, కళ్యాణపు రాణి, మిరియాల రమాదేవి, దామాల సునీత, ఆయాలు నిమ్మల ఉష, గుగులోతు హంసలి, ఆశా కార్యకర్తలు రామణ సరోజినీ, మరీదు లీలా కుమారి, గంగుల విజయలక్ష్మి, గద్దె తులసి, నక్కల నారాయణమ్మ, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గుగులోత్ రమేష్, రైతు సంఘం నాయకులు నీలకంఠం రాము ఎర్రగాని నాగరాజు, మల్టీ పర్పస్ వర్కర్స్ మండల కార్యదర్శి అంతోటి రమేష్ కార్మికులు బోయిన సుధాకర్, మంద నాగరాజు, పూజల శ్రీనివాసరావు, దార సురేష్, కెవిపిఎస్ నాయకులు ఏసుపోగు బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -