Thursday, February 12, 2026
E-PAPER
Homeజాతీయంసార్వ‌త్రిక స‌మ్మెలో క‌దంతొక్కిన హిమాచల్ యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్

సార్వ‌త్రిక స‌మ్మెలో క‌దంతొక్కిన హిమాచల్ యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సార్వ‌త్రిక స‌మ్మెలో హిమాచల్ యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్, సీఐటీయూ, హిమాచల్ కిసాన్ సభ గురువారం పిలుపునిచ్చిన దేశవ్యాప్త రైతు కార్మికుల సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన యాపిల్ ఉత్పత్తి ప్రాంతాలలో యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్ స్థానిక యూనిట్లు జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

జుబ్బల్, కోట్‌ఖై, రోహ్రు, చుహరా నుండి రైతులు, తోటల పెంపకందారులు గణనీయమైన సంఖ్యలో బస్ స్టాండ్ వద్ద పెద్ద గుమిగూడారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి కార్మిక నేత‌లు మాట్లాడుతూ..బీజేపీ పాల‌న‌లో ప్రస్తుత విధానాల వల్ల వ్యవసాయం, ఉద్యానవనాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని, సంఘటిత పోరాటమే పరిష్కారాన్ని చూపుతుందని, రైతు-కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -