- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికలుగా గుర్తింపు పొందిన లండన్‌లోని లార్డ్స్, లాహోర్‌లోని గడాఫీ స్టేడియాలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఉపయోగించిన పిచ్‌లు ‘అసంతృప్తికరం’ (అన్శాటిస్ఫ్యాక్టరీ)గా ఉన్నాయని నిర్ధారిస్తూ, ఈ రెండు వేదికలకు చెరో డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. ‘ఐసీసీ పిచ్ అండ్ అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్’ కింద ఈ చర్యలు తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది.
- Advertisement -



