సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి..
సమ్మెకు కదం దొరికిన కార్మికులు..
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మోడీని గద్దె దింపితేనే కార్మికులకు న్యాయం జరుగుతుంద ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. పేర్కొన్నారు. లేబర్ కోడ్స్, వి బి రాంజీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్ల లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం దగ్గర నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు కార్మికులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత 29 కార్మిక చట్టలను రద్దుచేసి 4 కోడెలను తీసుకొచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో 12 గంటల పని విధానాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాల్సిందే నని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు పారిశ్రామిక సంబంధాల కోడ్ తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్లను పెట్టుకోకుండా ఆంక్షలు తేవడం దారుణం అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంటే. వికసిత్ భారత్ జి రాంజీ చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పటివరకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఉన్న చట్టాన్ని మార్చి 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా రూపొందించి ఉపాధి హామీ పని నుంచి దూరం చేసే కుట్ట జరిగిందన్నారు. వెంటనే జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
జాతీయ విత్తన బిల్లును రద్దుచేసి కార్పొరేట్ దోపిడి నుంచి రక్షించాలని కోరారు.2025 చట్టం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలో నిది ఈ నిబంధనను మార్చి విద్యుత్ సవరణ చట్టం ద్వారా కేంద్రం పరిధిలోకి వచ్చిందన్నారు 2025 చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుందని విద్యుత్ చార్జీలు కేంద్రమే విద్యుత్ రెగ్యులారిటీ కమిషన్ ద్వారా నిర్ణయిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్ రద్దుచేసి పేద బడుగు బలహీన వర్గాల పై చార్జీల మోత మోగించనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలోకి 100% విదేశీ పెట్టబడును ఆహ్వానిస్తూ ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి ఐ ఎఫ్ టి యు బొంగురాల నరసింహ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొని మద్దతు ప్రకటించారు వివిధ సంఘాల నాయకులు ఆర్ ఆచారి దొనకొండ వెంకటేశ్వర్లు అవుట రవీందర్ బొమ్మిడి నగేష్ పాణ్యం వెంకట్రావు చింతకాయల సంతోష్ మారయ్య గంజి నాగరాజు వెంకన్న కత్తుల యాదయ్య పెరిక కృష్ణ సాగర్ల మల్లయ్య భీమనపల్లి శంకర్ బోడ ఇస్తారి రవి రేవెల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు కదం దొరికిన కార్మికులు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్మికులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ గత 20 రోజుల నుంచి సిఐటి యు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. గురువారం జరిగిన సమ్మెలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులు పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు. 12 గంటల పని విధానం రద్దు చేయాల్సిందేననినాదించారు.



