Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి 

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి 

- Advertisement -

హౌసింగ్ పీడీ వెంకట్ ఉపేంద్ర రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరూ కూడా త్వరగా పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ వెంకట్ ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బైరంపల్లి, చిల్వేర్, రాణి పేట, మిడ్జిల్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. బేస్మెంటు, ఉన్న ఇండ్లు త్వరగా పూర్తిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇప్పటివరకు ఎన్నెన్నో పూర్తయినవని అధికారులను అడుగు తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఇండ్లను పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. బిల్లుల కోసం ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని ఆరా తీశారు. ఆయన వెంబడి హౌసింగ్ డిఇ విజయ్ కుమార్, ఏ ఈ మహేష్,, సర్పంచులు నాగరాజు, సుజాత మల్లికార్జున రెడ్డి, మాధవి మల్లేష్, పంచాయతీ కార్యదర్శులు ఖలీల్, సుదర్శన్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -