- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా భారతలో పర్యటించనున్నారు. ఈయన పర్యటన ఫిబ్రవరి 18-22 వరకు ఉంటుంది. దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 19-20 వరకు 2వ ఎఐ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా భారత్ పర్యటన ఉండనుందని విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు లూలా భారత్‌ను సందర్శించనున్నారని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తాజాగా వెల్లడించారు. అలాగే ఈ పర్యటన సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు చర్చించుకోనున్నారు.
- Advertisement -



