Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర 

మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు క్యూ.ఆర్.టి (QRT), డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా అమలులోనే ఉన్నందున గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటించి ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని కోరారు.

ఫలితాల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపు కేంద్రాలకు హాజరయ్యేటప్పుడు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిళ్లు, పేలుడు ప్రమాదానికి దారితీసే ఇతర నిషేధిత వస్తువులను తీసుకురాకూడదని, తనిఖీలు చేసే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -