Friday, February 13, 2026
E-PAPER
Homeసినిమాయువతరానికి కనెక్ట్‌ అయ్యే సినిమా

యువతరానికి కనెక్ట్‌ అయ్యే సినిమా

- Advertisement -

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌, సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ఈ సినిమా గురించి చెప్పాడు. సినిమా చూడగానే వెరీ రియలిస్టిక్‌ యంగ్‌స్టర్‌ సినిమా అనిపించింది. నేటి యువతరం కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అని అన్నారు. ‘యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం ఇది.

నా రియల్‌ లైఫ్‌లో నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ సినిమా చూసిన తరువాత అందరూ థ్రిల్ల్‌ అయ్యి, షాకై, ఔట్‌ అవుతారు. మా చిత్రాన్ని పెద్ద సంస్థలు విడుదల చేయటం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు భిక్షు చెప్పారు. నిర్మాత కె.వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ‘ఏడు సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఈ సినిమా నిర్మించాను. ఈ సినిమాలో అందరూ ప్రతిభ గల వారు. అందరూ ఈ సినిమాను సొంత సినిమాలా భావించి నటించారు. నిజాయితీగా ఉంటే సక్సెస్‌ వస్తుందనే నమ్మకం నాకుంది. చాలా మంది తల్లిదండ్రులకు, యూత్‌కు ఈ సినిమాలో మేసేజ్‌ ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో తీశాం. మీ అందరిని సినిమా అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -