Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్‌ పాయింట్‌

యూనిక్‌ పాయింట్‌

- Advertisement -

బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై ‘హే భగవాన్‌’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుహాస్‌, శివానీ నగరం, సీనియర్‌ నటుడు నరేష్‌, యాంకర్‌ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ‘నాట్‌ ఏ ట్రైలర్‌’ పేరుతో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ ట్రైలర్‌ చాలా బాగుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.

‘రీసెంట్‌గా ఫస్ట్‌ కాపీ చూశాను. చాలా బాగా నవ్వుకున్నాను. నా సినిమా కాకుండా బయట సినిమా బాగా నవ్వానంటే అది తప్పు చేయదు. చాలా కష్టపడి ఒక్కో స్టెప్‌ ఎదుగుతూ వస్తున్నాడు సుహాస్‌. ఈ సినిమా కూడా కచ్చితంగా సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అని బన్నీ వాస్‌ చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘కొన్ని కథలకు ట్రైలర్‌లు చూపించలేం. ఈ కథను థియేటర్‌లోనే చూడాలి. అందుకే నాట్‌ ఏ ట్రైలర్‌ పేరుతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నాం. ఈ కథను ఊహించిన వారికి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో టాప్‌ ఐదుగురికి రూ.20వేలు ప్రైజ్‌ మనీ ఇవ్వబోతున్నాం. ఈనెల 20న కచ్చితంగా హిట్‌ కొట్టబోతున్నాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -