- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి (Governing Council) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. సమావేశానికి ముందు, విజయ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.
- Advertisement -



