Thursday, June 11, 2026
E-PAPER
Homeజాతీయంటీఎంసీకి మ‌రో రాజ్య‌స‌భ ఎంపీ రాజీనామా

టీఎంసీకి మ‌రో రాజ్య‌స‌భ ఎంపీ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దీదీ ఓట‌మి త‌ర్వాత టీఎంసీ అంత‌ర్గ‌త విభేదాల‌తో రెండు ముక్క‌లౌవుతోంది. ఇప్ప‌టికే పార్టీలోని ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలో రెండు వ‌ర్గాలుగా చీలారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రో రాజ్య‌స‌భ ఎంపీ షాక్ ఇచ్చారు. ఎంపీ ప‌ద‌వీతో పాటు పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ ప్రకాష్ చిక్ బరైక్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు గురువారం రాజ్యసభ చైర్మన్ సిపి. రాధాకృష్ణన్‌కు లేఖ రాశారు. త‌న రాజీనామాను త‌క్ష‌ణ‌మే ఆమోదించాల‌ని కోరారు. ఒక వారంలో ముగ్గురు ఎంపీలు టీఎంసీకి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. రెండు రోజుల క్రితం టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆమె రాజీనామాను రాజ్య‌స‌భ చైర్మ‌న్‌ ఆమోదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -