- Advertisement -
నవతెలంగాణ – సిద్ధిపేట
దుబ్బాక మున్సిపాలిటీ మూడో వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ కు 266 ఓట్లు పోలవ్వగా, బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి సత్తు శ్రీలత కు 266 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండె మానస కు 193 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థులైన అఫ్రీన్ కు 04, మఠం పద్మ 27,ఎండీ రెహన కు 127 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఇద్దరికీ సమానమైన ఓట్లు పోలవ్వగా అధికారులు డ్రా ద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంకణాల ఎల్లవ్వను విజేతగా ప్రకటించారు.
- Advertisement -



