నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి, తనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు శుక్రవారం ఒక ప్రక్రటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు మీ కళ్ల ముందు కనిపించే మార్పులో చూపిస్తానని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని, ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులకు, కర్తకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.



