Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షటిల్ విజేతలకు బహుమతులు అందజేత

షటిల్ విజేతలకు బహుమతులు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని పాత హైస్కూల్ క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా ఆకుల లక్ష్మీ స్మారకార్థం ఆమె మనువడు ఆకుల రాకెష్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్ టోర్నీని  నిర్వహించారు.శుక్రవారం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి పెద్దతూoడ్ల టీం రూ.5016, ద్వితీయ బహుమతి తాడిచెర్ల టీం రూ.3016,బెస్ట్ ప్లేయర్ కు ప్రత్యేక అవార్డు ఇవ్వడం జరిగిందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, తాడిచెర్ల మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,సర్పంచ్ లు బండి స్వామి,కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -