Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని హోన్నజీపేట గ్రామ సర్పంచ్ మద్దికుంట ఆశమ్మ, తన పాలక వర్గంలోని కొంతమంది వార్డు సభ్యులతో కలిసి శుక్రవారం కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆధ్వర్యంలో  రూరల్ ఎమ్మెల్యే డా, భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. హాన్నాజోపేట గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తామని, గ్రామాన్ని కాంగ్రేస్ పార్టీ ద్వారా అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

అలాగే సర్పంచ్ మాట్లాడుతూ .. కాంగ్రేస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తమపాలక వర్గంలోని కొందరు వార్డు సభ్యులతో కలిసి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. తన ఆశయం గ్రామ అభివృద్ధి, అందుకే కాంగ్రేస్ పార్టీలో గ్రామము అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశభావం వెక్తం చేశారు. పార్టీలో సర్పంచ్ వెంట  వార్డు సభ్యులు మద్దికుంట రాఘవేందర్, పోతుగంటి రాజవ్వ, మేడారం జీవన్ రెడ్డిలు చేరారు. కార్యక్రమములో మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, డా, మోహన్, జాన్ రెడ్డి, సొసైటీ మాజీ చేర్మెన్ జనార్దన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నరబోయిన రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -